Prakash Raj : బిజెపి నన్ను కొనలేదు : నటుడు ప్రకాష్‌ రాజ్‌

Apr 6,2024 07:29 #Prakash Raj, #Social Media

న్యూఢిల్లీ : తాను బిజెపిలో చేరుతున్నానంటూ వచ్చిన వార్తలను ప్రముఖ నటుడు ప్రకాష్‌ రాజ్‌ ఖండించారు. ఆ వార్తలను తోసిపుచ్చుతూ… శుక్రవారం తనదైన శైలిలో వివరణనిచ్చారు. ‘వారు ప్రయత్నించారని నేను ఊహిస్తున్నాను. వారు నన్ను కొనుగోలు చేసేంత (సైద్ధాంతికంగా) ధనవంతులు కాదని గ్రహించి ఉండాలి. మీరు ఏమనుకుంటున్నారు. ఫ్రెండ్స్‌..’ అని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ప్రధాని మోడీ వివాదాస్పద విధానాలపై ప్రకాష్‌ రాజ్‌ విమర్శలు గుప్పిస్తూవస్తున్న సంగతి విదితమే. అయితే ‘ప్రముఖ నటుడు ప్రకాష్‌ రాజ్‌ ఈ రోజు మధ్యాహ్నం 3.00 గంటలకు బిజెపిలో చేరనున్నారు’ అంటూ ‘స్కిన్‌ డాక్టర్‌’ పేరు మీద సోషల్‌ మీడియాలో ఓ ట్వీట్‌ పోస్టయింది. మధ్యాహ్నం 2.56 గంటలకు పోస్టయిన ఈ ట్వీట్‌ నిమషాల్లోనే వైరల్‌గా మారడంతో ప్రకాష్‌ రాజ్‌ స్పందించారు.

➡️