మరోసారి కలవరపెడుతున్న కోవిడ్‌

Dec 11,2023 15:30 #covid, #new corona cases

 

న్యూఢిల్లీ : కరోనా కనుమరుగైపోయిందని అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఇలాంటి తరుణంలోనే దేశ ప్రజానీకాన్ని మరోసారి కరోనా కలవరపెడుతోంది. అనూహ్యంగా దేశంలో కరోనా కేసులు పెరిగాయి. కేవలం ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 166 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ సోమవారం వెల్లడించింది. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా మొత్తంగా 895 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా వేరియంట్‌ ఇన్‌ప్లూయెంజా వైరస్‌ వల్లే శీతాకాలంలో కరోనా కేసుల పెరుగుదలకు కారణమని కేంద్రప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కరోనా కేసులు పెరగడంతో శీతాకాలంలో అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సూచించింది. కాగా, కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 4.44 కోట్ల మంది ఈ వైరస్‌ బారినపడ్డారు. దాదాపు 5,33,306 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో కరోనా మరణాల రేటు 1.19గా ఉంది. ఇక కరోనా నియంత్రణా చర్యల్లో భాగంగా.. ఇప్పటివరకు కేంద్రం 220.67 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసింది.

➡️