ఖతార్‌లో 8మంది భారత నౌకాదళ మాజీ అధికారులకు ఉపశమనం

Dec 29,2023 08:23 #Navy, #Qatar
qatari-court-commutes-death-sentences-of-8-ex-indian-navy-personne

 

న్యూఢిల్లీ : గూఢచర్యం ఆరోపణలతో మరణశిక్ష విధించబడిన ఎనిమిదిమంది భారత నౌకాదళ మాజీ అధికారుల శిక్షను తగ్గిస్తూ ఖతార్‌ కోర్టు గురువారం తీర్పునిచ్చింది. వీరికి ఎన్నేళ్ల జైలు శిక్ష విధించారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తీర్పునకు సంబంధించి పూర్తి వివరాల కోసం ఖతార్‌ అధికారులతో చర్చిస్తున్నామని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ కేసులో తదుపరి చర్యలు చేపట్టేందుకు న్యాయ బృందంతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. భారత్‌కు చెందిన ఎనిమిదిమంది నౌకాదళ మాజీ అధికారులు ఖతార్‌లోని అల్‌ దహ్రా సంస్థలో పనిచేస్తున్నారు. ఈ ఎనిమిది మందిని గూఢచర్యం ఆరోపణలతో ఖతార్‌ అధికారులు 2022 ఆగస్టులో నిర్బంధంలోకి తీసుకున్నారు. వారికి మరణ శిక్ష విధిస్తూ ఈ ఏడాది అక్టోబరులో అక్కడి కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై కేంద్ర విదేశాంగ శాఖ ఖతార్‌లోని అప్పీల్‌ కోర్టులో పిటీషన్‌ వేసింది.

➡️