కేంద్రంపై నిరసిద్దాం రండి !

Jan 24,2024 10:21 #Kerala Minister, #M.K. Stalin

 తమిళనాడు సిఎంను ఆహ్వానించిన కేరళ

తిరువనంతపురం : రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో భాగస్వామ్యం కావాల్సిందిగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ను కేరళ ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు కేరళ న్యాయశాఖ మంత్రి పి రాజీవ్‌ నేతృత్వంలోని బృందం సోమవారం నాడు చెన్నరు వెళ్లి స్టాలిన్‌తో సమావేశమయ్యారు. ఫిబ్రవరి 8న న్యూఢిల్లీలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, మంత్రులతో కలిసి నిరసన చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రాల గళాన్ని కేంద్రానికి వినిపించాల్సిందిగా స్టాలిన్‌ను ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పక్షాన రాజీవ్‌ బృందం కోరింది. అలాగే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేరళ దాఖలు చేసిన పిటీషన్‌ విషయంపైనా స్టాలిన్‌కు రాజీవ్‌ వివరించారు. కేంద్రం విధించిన ఆర్థిక ఆంక్షలను వ్యతిరేకించాల్సిన అవసరముందని, కేంద్రం తీరును నిరసించాల్సిన అవసరముందని ఈ సందర్భంగా స్టాలిన్‌ పేర్కొన్నారు.

➡️