ఒడిషాలో రోడ్డు ప్రమాదం

Apr 16,2024 01:30 #road acident
  •  ఐదుగురి మృతి శ్రీ 40 మందికి గాయాలు

జజ్‌పుర్‌: ఒడిషాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జజ్‌పుర్‌ జిల్లాలోని జాతీయ రహదారి 16పై ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి కిందపడింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. 40 మందికి గాయాలు అయ్యాయి. ఘటన జరిగిన సమయంలో బస్సులో 50 మంది ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. 30 మంది క్షతగాత్రులను కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఒడిషా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారికి రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బస్సు పూరి నుంచి కోల్‌కతాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

➡️