stay on CAA : విచారణను ఏప్రిల్‌ 9కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

Mar 19,2024 16:49 #CAA, #Supreme Court

న్యూఢిల్లీ  :    వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై స్టే విధించాలంటూ  దాఖలైన పిటిషన్‌లపై విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్‌ 9కి వాయిదా వేసింది.   ఈ  చట్టం అమలుపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్‌లపై మంగళవారం   చీఫ్‌ జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనంవిచారణ చేపట్టింది.  కేంద్రానికి  నోటీసులు జారీ చేసింది.

విచారణ సందర్భంగా  తమ సమాధానం తెలిపేందుకు  సమయం కావాలని కేంద్రం కోరింది.  దీంతో  తదుపరి విచారణను ఏప్రిల్‌ 9కి వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది.  అయితే తదుపరి విచారణ వరకు సిఎఎ ప్రకారం పౌరసత్వం జారీ చేయమని సుప్రీంకోర్టులో ప్రకటన ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది.

కేంద్రం ప్రకటన చేయాల్సిందేనని పిటిషనర్లు వాదించారు.  ఒకవేళ ప్రకటన చేయకుంటే న్యాయపరమైన ఉత్తర్వును ఆమోదించాలని సుప్రీంకోర్టును కోరారు. అయితే కోర్టు ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు.  ‘ఆశ – విశ్వాసం-న్యాయం’ అంశాల దృష్ట్యా కోర్టు ఈ అంశాన్ని తీవ్రమైనదిగా పరిగణించాలని పిటిషనర్లు వాదించారు.

➡️