ఏడో దశ లోక్‌ సభ ఎన్నికల నోటిఫికేషన్‌ రిలీజ్‌

ఢిల్లీ : దేశంలో ఏడో దశ లోక్‌ సభ ఎన్నికల నోటిఫికేషన్‌ను బుధవారం ఎలక్షన్‌ కమిషన్‌ విడుదల చేసింది. చివరిదైనా ఏడో దశలో దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 57 పార్లమెంట్‌ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. నేటి నుండి ఈ నెల 14 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఇవ్వగా.. 15న నామినేషన్లను స్క్రూటీని చేయనున్నారు. ఈ నెల 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. జూన్‌ 1న పోలింగ్‌ జరగనుండగా.. జూన్‌ 4న ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లోని ఒక స్థానంతో పాటు పశ్చిమ బెంగాల్‌ 9, ఉత్తరప్రదేశ్‌ 13, పంజాబ్‌ 13 , బీహార్‌ 8, ఒడిశా 6, హిమాచల్‌ ప్రదేశ్‌ 4, జార్కండ్‌లో 3 స్థానాలకు లాస్ట్‌ ఫేజ్‌లో పోలింగ్‌ జరగనుంది. ప్రధాని మోడీ పోటీ చేస్తోన్న వారణాసి లోక్‌ సభ స్థానానికి కూడా ఈ దశలోనే పోలింగ్‌ జరగనుంది.

➡️