ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టిన సుఖ్బీర్‌ సింగ్‌, జ్ఞానేశ్‌కుమార్‌లు

Mar 15,2024 13:01 #Election Commissioners

న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా సుఖ్బీర్‌ సింగ్‌ సంధు, జ్ఞానేశ్‌కుమార్‌లు గురువారం నియమితులైన సంగతి తెలిసిందే. వీరిద్దరూ శుక్రవారం ఉదయం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల కమిషనర్‌గా ఉన్న అనూప్‌ చంద్రపాండే గత నెలలో పదవీ విరమణ చేయగా.. మరో కమిషనర్‌ అరుణ్‌ గోయెల్‌ ఇటీవలే అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో కొత్త కమిషనర్ల నియామకం అనివార్యమైంది. దీంతో గురువారం ప్రధాని నేతృత్వంలో సమావేశమైన సెలక్షన్‌ కమిటీ కొత్త కమిషనర్లుగా సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధూ, జ్ఞానేశ్‌కుమార్‌లను ఎంపిక చేసింది. ఈ మేరకు గురువారం కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే వీరి ఎంపికపై సెలక్షన్‌ కమిటీ సభ్యుడైన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌదరి అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

➡️