తమిళనాడులో మరో రెండు రోజులు భారీ వర్షాలు..

Dec 3,2023 15:58 #rain alert, #Tamil Nadu

 చెన్నై :   తమిళనాడులో మరో రెండు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (ఐఎండి) ఆదివారం ప్రకటించింది. గత రెండురోజులగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. చెన్నైతో పాటు అనేక జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండి  అంచనా వేసింది. తిరువల్లూర్‌, కాంచీపురం, చెంగల్‌పట్టు, చెన్నై, టెంకాశీ, తూత్తుకూడై, తిరునల్వేలి, కన్యాకుమారి జిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండి తెలిపింది. తమిళనాడులో ఇప్పటికే అనేక ప్రాంతాల్లోని విద్యాసంస్థలు మూతపడ్డాయి. మరికొన్ని రోజుల పాటు సెలవులు జారీ చేయవచ్చని విద్యాసంస్థలు పేర్కొన్నాయి.

➡️