లోక్‌సభ ఎన్నికల మూడో దశ నామినేషన్‌ ప్రారంభం

Apr 12,2024 10:41 #3rd phase, #loksabha elections

ఢిల్లీ : 12 రాష్ట్రాల్లోని 94 నియోజకవర్గాల్లో మే 7న జరగనున్న మూడో దశ లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. రాష్ట్రపతి తరపున ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసిన అనంతరం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
మూడో దశలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలివే..
అస్సాం, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, దాద్రా నగర్‌ హవేలీ, డామన్‌ డయ్యూ, గోవా, గుజరాత్‌, జమ్మూకశ్మీర్‌, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌. కాగా, నామినేషన్‌ పత్రాల దాఖలుకు ఆఖరి తేదీ ఏప్రిల్‌ 19.
ఇక మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌ నియోజకవర్గంలో ఎన్నికల వాయిదా కోసం మరో నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు ఎలక్షన్‌ కమిషన్‌ తెలిపింది. బేతుల్‌ లోక్‌సభ స్థానంలో బరిలో నిలిచిన బీఎస్‌పీ అభ్యర్థి మరణంతో ఎన్నికలు వాయిదా పడ్డాయని ఈసీ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. బేతుల్‌ నియోజకవర్గంలో రెండో దశలో ఏప్రిల్‌ 26న పోలింగ్‌ జరగాల్సి ఉంది.

➡️