తీవ్ర ముప్పులో వేలాది చిత్తడి నేలలు : శ్రీ జైరాం రమేష్‌

Feb 21,2024 11:03 #Jairam Ramesh

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వేలాది చిత్తడి నేలలు ప్రతిరోజూ తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయని, పర్యావరణపరంగా ఎంతో కీలకమైన చిత్తడి నేలలను రక్షించుకోవడం చాలా అవసరమని కాంగ్రెస్‌ నాయకులు, కేంద్ర పర్యావరణ శాఖ మాజీ మంత్రి జైరాం రమేష్‌ తెలిపారు. ఈ మేరకు సోషల్‌ మీడియా ఖాతాలో రమేష్‌ పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 80 రామ్‌సర్‌ క్షేత్రాలు ఉన్నాయని, గరిష్టంగా తమిళనాడులో 16, ఉత్తరప్రదేశ్‌లో 10 ఉన్నాయని అన్నా రు. చిత్తడి నేలలు రక్షణపై 1971లో ఇరాన్‌ దేశంలోని రామ్‌సర్‌ పట్టణంలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో భారత్‌ సంతకం చేసింది. ఈ సమావేశానికి భారత ప్రతినిధిగా ప్రముఖ పక్షి శాస్త్రవేత్త సలీం అలీని అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ పంపారు. అప్పటి నుంచి చిత్తడి నేలలను ‘రామ్‌సర్‌ క్షేత్రాలు’గానూ పేర్కొంటారు. ‘ఇది ఎలా జరిగిందో నా పుస్తకం ‘ఇందిరా గాంధీ: ఎ లైఫ్‌ ఇన్‌ నేచర్‌’లో వివరించాను’ అని జైరార రమేష్‌ తెలిపారు. ఒడిషాలోని చిలికాను 1981 అక్టోబర్‌ 1న దేశంలో తొలి రామ్‌సర్‌ క్షేత్రంగా గుర్తించారని ఆయన గుర్తుచేశారు. భారత్‌ జోడో న్యారు యాత్రకు మంగళవారం విరామం ఇవ్వడంతో ఉత్తరప్రదేశ్‌లోని రారుబరేలీ జిల్లాలోని రామ్‌సర్‌ క్షేత్రమైన సమసాపూర్‌ పక్షుల అభయారాణ్యాన్ని దర్శించినట్లు జైరాం రమేష్‌ తెలిపారు. ఈ క్షేత్రం సుమారు 2 వేల ఎకరాల్లో విస్తీర్ణంలో విస్తరించి ఉందని, కొంగలతో సహా అనేక రకాల పక్షులకు ఆవాసంగా ఉందని తెలిపారు. దేశవాప్య్తంగా రామ్‌సర్‌ సదస్సు పరిధిలోకి రాని వేలాది చిత్తడి నేలలు ఉన్నాయని, వీటి పరిరక్షణ చాలా అవసరమని జైరాం రమేష్‌ తెలిపారు.

➡️