లోక్‌సభ , అయిదు రాష్ట్రాల శాసనసభలకు నేడు ఎన్నికల నగారా

  • బాధ్యతలు స్వీకరించిన కొత్త ఇసిలు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ శనివారం విడుదల కానుంది. 18వ లోక్‌సభతో పాటు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. నూతన ఎన్నికల కమిషనర్లుగా నియమితులైన సుఖ్‌ బీర్‌ సింగ్‌ సంధు, జ్ఞానేశ్వర్‌ కుమార్‌ శుక్రవారం ఉదయం నిర్వాచన్‌ సదన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ నేతృత్వంలో ఇసిలు భేటీ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌, నిర్వహణ, దశల వారీగా ఎన్నికల తేదీలు, ఇతర అంశాలపై చర్చించారు. శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయనున్నట్లు ఇసి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలోని మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్‌, జమ్ముకాశ్మీర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేయనున్నారు. వీటితోపాటు మరణించడం వల్ల కానీ, ఇతర కారణాల వల్ల కానీ ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా నిర్వహిస్తారు.

➡️