దబోల్కర్‌ హత్య కేసులో ఇద్దరికి యావజ్జీవం

-మరో ముగ్గురికి విముక్తి
పూణే : ప్రముఖ హేతువాది నరేంద్ర దబోల్కర్‌ హత్య కేసులో అరెస్టు అయినవారిలో ఇద్దరిని దోషులుగా నిర్ధారించి, వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ పూణే కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. వీరికి యావజ్జీవ శిక్ష విధించడంతో పాటూ రూ.5లక్షల జరిమానా కూడా విధించింది. మరో ముగ్గురు నిందితులను నిర్దోషులుగా విడిచిపెట్టింది. విడుదలైన వారిలో డాక్టర్‌ వీరేంద్ర సింగ్‌ తవాడె, విక్రమ్‌ భావె, సంజీవ్‌ పునాల్కర్‌ వున్నారు. అయితే ముగ్గురిని నిర్ధోషులుగా ప్రకటించడంపై నరేంద్ర దబోల్కర్‌ కుమారుడు డాక్టర్‌ హమీద్‌ దబోల్కర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాల్పులు జరిపిన దుండగులతో పాటు ఈ హేయమైన ఘాతుకానికి ఒడిగట్టిన సూత్రధారులను కూడా శిక్షించాల్సిన అవసరం వుందని ఆయన పేర్కొన్నారు. న్యాయం కోసం ఈ విషయాన్ని సుప్రీం కోర్టుకు తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు చెప్పారు. 2013 ఆగస్టు 20న ఓంకారేశ్వర్‌ బ్రిడ్జిపై మార్నింగ్‌ వాక్‌ చేస్తుండగా, నరేంద్ర దబోల్కర్‌ను సంఫ్‌ు పరివార్‌ దుండగులు కాల్చి చంపిన సంగతి విదితమే.

➡️