ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు రౌడీషీటర్లు హతం

Dec 27,2023 13:31 #chennai, #encounter

చెన్నై: తమినాడులోని కాంచీపురంలో ఇద్దరు రౌడీ షీటర్లను పోలీసుల ఎన్‌కౌంటర్‌ చేశారు. నిందితులు పోలీసులపై దాడికి యత్నించగా కారణంగానే ఎన్‌కౌంటర్‌ జరిగిందని అధికారులు చెబుతున్నారు. వివరాల ప్రకారరం.. చెన్నైలోని కాంచీపురంలో బుధవారం తెల్లవారుజూమున ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు రౌడీలను కాంచీపురం పోలీసులు కాల్చి చంపారు. కాంచీపురం రైల్వే బ్రిడ్జి సమీపంలో పోలీసు సిబ్బందిని నరికివేయడానికి ప్రయత్నించగా.. వారు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో రఘువరన్ మరియు కరుప్పు హసన్ మరణించారు. కాగా, మరో రౌడీ షీటర్‌ ప్రభ హత్య కేసులో వీద్దరిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

➡️