పట్టణాల అభివృద్ధికి త్వరలోనే అర్బన్‌ కమిషన్‌ ఏర్పాటు : పినరయి విజయన్‌

Urban Commission soon for development of cities in Kerala, says Chief Minister Pinarayi Vijayan

తిరువనంతపురం : రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధి కోసం త్వరలోనే అర్బన్‌ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వెల్లడించారు. శుక్రవారం ఎర్నాకుళం జిల్లాలోని కలూర్‌లో జరిగిన నవకేరళ సదస్సు పబ్లిక్‌ ఔట్రీచ్‌ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన అల్పాహార సమావేశంలో మాట్లాడుతూ విజయన్‌ ఈ విషయాన్ని తెలిపారు. అంతర్జాతీయ నిపుణులతో కూడిన ఈ కమిషన్‌ ఏర్పాటు ప్రక్రియ పురోగతిలో ఉందని విజయన్‌ చెప్పారు. ఈ సందర్భంగా కొచ్చి అభివృద్ధి గురించి మాట్లాడుతూ నగరంలో నీటి ఎద్దడి సమస్యను కొచ్చి కార్పొరేషన్‌ సమర్థవంతంగా పరిష్కరించగలిగిందని అన్నారు. అలాగే పర్యాటక రంగంలో అభివృద్ధి పనులను తమ ప్రభుత్వం చురుగ్గా కొనసాగిస్తోందన్నారు. వికలాంగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడానికి కూడా తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

➡️