భారత్‌ జోడో న్యారు యాత్రలో పాల్గొన్న ప్రియాంక

మొరాదాబాద్‌ (ఉత్తరప్రదేశ్‌) : భారత్‌ జోడో న్యాయ యాత్రలో కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొన్నారు. ఈ యాత్ర ప్రారంభమైన నెల తర్వాత ప్రియాంక ఈ యాత్రలో పాల్గొన్నారు. శనివారం ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కి చేరిన ఈ యాత్రకు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలతోపాటు, సమాజ్‌వాదీపార్టీ కార్యకర్తలు కూడా ఘన స్వాగతం పలికారు. ఈ యాత్రలో రాహుల్‌, ప్రియాంకతోపాటు సమాజ్‌వాదీపార్టీకి చెందిన ఎంపి ఎస్‌.టి హసన్‌ కూడా పాల్గొన్నారు.

కాగా, ఈ యాత్ర మొరాదాబాద్‌ నుండి, అమ్రోహా, సంభాల్‌, బులంద్‌షహర్‌, అలీఘర్‌, హత్రాస్‌, ఆగ్రా మీదుగా ఫతేపూర్‌ సిక్రీ మీదుగా ఈ యాత్ర సాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. రేపు ఆదివారం (ఫిబ్రవరి 25) రోజు ఆగ్రాకు వెళ్లే క్రమంలో ఈ యాత్రలో ఉత్తరప్రదేశ్‌ మాజీ సిఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ కూడా ఈ యాత్రలో పాల్గొననున్నారు.

➡️