బర్రక్‌పుర్‌లో ఏచూరి ప్రచారం

May 17,2024 23:15 #Barrackpore, #Yechury campaign

కొల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో లెఫ్ట్‌ఫ్రంట్‌ అభ్యర్థులకు మద్దతుగా జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో సిపిఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గన్నారు. బర్రక్‌పుర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి దేవదత్‌ ఘోష్‌కు మద్దతుగా శుక్రవారం జరిగిన బహిరంగసభలో ఏచూరి ప్రసంగించారు. మతోన్మాద బిజెపిని, నిరంకుశ తృణమూల్‌ కాంగ్రెస్‌ను ఓడించి వామపక్ష, ప్రగతిశీల అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సభలో దేవదత్‌ ఘోష్‌తో పాటు పశ్చిమ బెంగాల్‌ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు గార్జి ఛటర్జీ, సోమనాథ్‌ భట్టాచార్య తదితరులు ప్రసంగించారు.

➡️