యశ్వంత్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

కర్నాటక : కర్నాటకలోని తుమూకూరు జిల్లాలో యశ్వంత్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. యశ్వంత్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌ హాసన్‌కు బయలుదేరగా కుణిగల్‌ సమీపంలోని ట్రాక్‌ పై హైవోల్టేజ్‌ విద్యుత్‌ లైన్‌ పడి ఉంది. దీన్ని వెంటనే గమనించిన లోకోపైలట్‌ రైలుని ఆపేయడంతో వేల మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.

➡️