అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన పోచారం

Mar 17,2024 15:15 #Check, #rain damaged crops

కామారెడ్డి : అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను మాజీ స్పీకర్‌, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఆదివారం పరిశీలించారు. కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్‌ మండలంలోని అన్నారం, చించోలి, కిష్టాపూర్‌ గ్రామాల్లో అకాల వర్షాలకు భారీగా పంటలు దెబ్బతిన్నాయి.విషయం తెలుసుకున్న పోచారం ఆయా గ్రామాల్లో పర్యటించారు. రైతులతో మాట్లాడి ఓదార్చారు. ఎవరు అధైర్య పడొద్దని అండగా ఉంటామన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు.

➡️