అక్రమాలు బయటపడుతున్నాయనే కేశినేని నాని పార్టీ మారారు : కేశినేని చిన్ని

Feb 17,2024 14:21 #kesineni chinni, #press meet

విజయవాడ: వైసిపికి వెళ్లిన కేశినేని నానిపై టిడిపి సీనియర్‌ నేత కేశినేని శివనాథ్‌(చిన్ని) తీవ్ర విమర్శలు చేశారు. ”వైసిపిలో విజయవాడ ఎంపీ సీటు ఇంకా ఖరారు కాలేదు. చంద్రబాబుని విమర్శించే వారిని ముందు ప్రోత్సహించి.. తర్వాత సీటు ఎగ్గొట్టటం జగన్‌ నైజం. విజయవాడ వైసిపి ఎంపీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారో చూడాలి. విజయవాడ పశ్చిమలో తెలుగుదేశం టిక్కెట్లు ఇప్పిస్తానని కేశినేని నాని ఇద్దరి వద్ద డబ్బులు వసూలు చేశారు. ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేశారో త్వరలోనే అన్ని ఆధారాలు బయటపెడతాం. నానికి డబ్బులిచ్చి మోసపోయిన వారు త్వరలోనే మీడియా ముందుకు వస్తారు. అక్రమాలు బయటపడుతున్నాయనే ఆయన పార్టీ మారారు. మరో 2 నెలల్లో కేశినేని నాని ప్రజా జీవితానికి దూరం కావటం ఖాయం” అని కేశినేని చిన్ని పేర్కొన్నారు.

➡️