అసభ్య పదజాలం వాడకపోవడమే నా అసమర్థతా ? : పార్థసారథి

Jan 12,2024 12:15 #Comments, #Parthasarathy

పెనమలూరు : అసభ్య పదజాలం వాడకపోవడమే నా అసమర్థతా ? అని పెనమలూరు వైసిపి ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ప్రశ్నించారు. ” నాకు ఏ అర్హత లేదని మంత్రి పదవి ఇవ్వలేదో తెలీదు. ప్రతిపక్షాలపై దౌర్జన్యాలు చేయకపోవడమే నా అసమర్థతా ? వైసిపిలో బిసిలకు అగ్రతాంబూలం.. నేతి బీరకాయలో నెయ్యి చందమే. బలహీన వర్గాలకు పార్టీలో గుర్తింపు ఉంటుందని గతంలో చెప్పా. అది తప్పని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. బిసిలు, ఎస్సీలు ఎవరి కాళ్లపై వారు నిలబడాలనుకుంటారు. మరొకరి పెత్తనంపై ఆధారపడాల్సి వస్తే నాలా ఆత్మాభిమానం చంపుకోరు ” అని చెప్పారు.

➡️