ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. ప్రయాణికులకు గాయాలు

Jan 13,2024 16:30 #bus accident, #vikarabad

వికారాబాద్‌: అనంతగిరి అడవుల్లో శనివారం మధ్యాహ్నాం ఘోర ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో కిక్కిరిసి ఉన్న ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి.. అడవుల్లోని పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది. మరో 20 మందికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం.తాండూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ప్రయాణికులను వికారాబాద్‌ నుంచి తాండూరుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అనంతగిరి గుట్ట దిగుతుండగా కెరెల్లి సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పొదల్లోకి వెళ్లింది. ఆ సమయంలో బస్సులో వంద మంది ఉన్నట్లు తెలుస్తోంది. స్వల్ప గాయాలైన వారిని వికారాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్సలు నిర్వహిస్తున్నారు.

➡️