ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి సాధారణ వ్యక్తిలా నిల్చని ప్రయాణించారు. న్యూ ఇయర్‌ సందర్భంగా సోమవారం భట్టి విక్రమార్క ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి తన నివాసానికి బయలుదేరిన భట్టి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా డిప్యూటీ సీఎం బస్సులో ప్రయాణించడం పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

➡️