ఇంటింటి ప్రచారానికి నిబంధనలను పున:పరిశీలించాలి: సిపిఎం

Mar 26,2024 23:36 #cp press meet, #cpm

అమరావతి: ఎన్నికల్లో కరపత్రాల పంపిణీకి, ఇంటింటి ప్రచారానికి కూడా 48 గంటల ముందు అనుమతి తీసుకోవాలన్న నిబంధనలను పున : పరిశీలించాలని సిపిఎం కోరింది. సమావేశానికి హాజరైన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కె.హరికిషోర్‌లు మాట్లాడుతూ ఈ నిబందన ఆచరణ సాధ్యం కాదన్నారు. రాష్ట్ర, జిల్లా పార్టీ కార్యాలయాల దగ్గర ఏర్పాటు చేసిన జెండా పోల్స్‌, బ్యానర్లు తొలగించకుండా ఆదేశాలివ్వాలని, మేడే కార్యక్రమాల నిర్వహణకు ఎటువంటి ఆంక్షలు లేకుండా అనుమతించాలని కోరారు. కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాల్లో ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు జెండాపోల్స్‌, జెండా దిమ్మెలు తొలగించిన అధికారులుపై చర్యలు తీసుకోవాలని, ఇతర జిల్లాల్లో తొలగించకుండా ఆదేశాలివ్వాలని కోరారు. 2019లో పెట్టిన బైండోవర్‌ కేసుల పేరుతో పార్టీల కార్యకర్తలను స్టేషన్స్‌కు పిలిచి వేధించడం సరికాదని చెప్పారు.

➡️