ఇది సీఎం జగన్‌ చరిష్మా.. ట్రెండింగ్‌లో ‘సిద్ధం’

అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిష్మా మరోసారి ప్రపంచానికి తెలిసింది. సోషల్‌ మీడియాలో ‘సిద్ధం’ కార్యక్రమం ట్రెండింగ్‌లో నిలిచింది. ఎక్స్‌(ట్విట్టర్‌)లో దేశంలోనే మొదటిస్థానంలో సిద్ధం’ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. సిద్ధం అప్‌డేట్స్‌ను వైఎస్సార్‌సీపీ అభిమానులు భారీగా షేర్‌ చేస్తున్నారు. ‘సిద్ధం’ సభా ప్రాంగణం ఫొటోలతో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ నిండిపోయింది.ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి గత నెల 27న భీమిలి వేదికగా శంఖం పూరించిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా క్షేత్రంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రాయలసీమలోని రాప్తాడులో సిద్ధం సభకు సీఎం జగన్‌ సిద్దమయ్యారు. నేడు రాప్తాడు వద్ద సిద్ధం సభకు రాయలసీమ ప్రాంతంలోని 52 నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలివస్తున్నారు.కాగా, భీమిలి, ఏలూరులలో నిర్వహించిన సభ­లకు జనం సంద్రంలా పోటెత్తడం.. జయహౌ జగన్‌, మళ్లీ సీఎం జగనే అన్న నినాదాలతో సభా ప్రాంగణాలు ప్రతిధ్వనించడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు సమరోత్సాహంతో కదం తొక్కుతున్నాయి. ఇక, సభ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం కానుంది.

➡️