ఈడీ ఎదుట హాజరైన ఎమ్మెల్యే వివేక్‌

Jan 18,2024 15:30 #ed enquiry, #mla vivek

హైదరాబాద్‌ : చెన్నూరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ వెంకటస్వామి గురువారం ఈడీ ఎదుట హాజరయ్యారు. ఎన్నికల ముందు హైదరాబాద్‌లో నమోదైన హవాలా, ఫెమా కేసుకు సంబంధించి ఈడీ ఎదుట హాజరయ్యారు. ప్రైవేట్‌ సెక్యూరిటీ సంస్థలో పెద్ద ఎత్తున నిధుల డిపాజిట్ల పై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.విశాఖ ఇండిస్టీ నుంచి ప్రవేట్‌ సెక్యూరిటీ సంస్థలో రూ.8 కోట్ల పైచిలుకు నిధుల లవాదేవీలపై గతంలోనే పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ ఇండిస్టీస్‌, విజిలెన్స్‌ సెక్యూరిటీస్‌ కేసుల్లో సుదీర్ఘ విచారణ చేపట్టారు. అలాగే డిపాజిట్లకు సంబంధించి ఈడీ ఆరా తీస్తున్నట్లు సమాచారం.

➡️