ఉరేసుకుని బాలిక మృతి

Nov 22,2023 16:16 #Suicide, #West Godavari District
girl-suicide-in-konaseema

ప్రజాశక్తి-పాలకొల్లు : పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజ తూర్పులో 15ఏళ్ల బాలిక ఉరివేసుకుని మృతి చెందింది. ప్రేమ వ్యవహారంగా పోలీసులు భావిస్తున్నారు. కోనసీమ జిల్లా మల్కిపురం మండలం చింతల మోరికి చెందిన బాలిక 10వ తరగతి చదివి ఇంటి వద్ద ఉంటోంది. బాలికను ప్రేమించిన అబ్బాయిపై కుటుంబ సభ్యులు పలుమార్లు కేసులు పెట్టినట్లు చెబుతున్నారు. దీంతో బాలికను కాజలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంచారు. ఈ నేపథ్యంలో బాలిక మంగళవారం అమ్మమ్మ ఇంట్లో లేని సమయంలో ఉరివేసుకుని మృతి చెందింది. ‌యలమంచిలి ఎస్ఐ జెఎన్వి ప్రసాద్ సారధ్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️