ఎన్టీఆర్‌ సిద్ధాంతాలను ట్రస్ట్‌ పాటిస్తోంది: నారా భువనేశ్వరి

Jan 18,2024 14:23 #nara bhuvaneswari, #speech

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ అంటేనే నిబద్ధత అని ‘ఎన్టీఆర్‌ ట్రస్ట్‌’ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆమె మాట్లాడారు. ”ఎన్టీఆర్‌ సిద్ధాంతాలను ట్రస్ట్‌ పాటిస్తోంది. ఆయన వర్ధంతికి ఏటా లెజెండరీ బ్లడ్‌ డొనేషన్‌ క్యాంపు నిర్వహిస్తున్నాం. మీరు ఇచ్చే ప్రతి రక్తపు బట్టు.. మరొకరి జీవితంలో సంతోషాన్ని ఇస్తుంది. ట్రస్ట్‌ తరఫున రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్య, సామాజిక సేవ వంటి కార్యక్రమాలు చేపడుతున్నాం” అని భువనేశ్వరి అన్నారు.

➡️