ఎల్‌బీ స్టేడియం పరిసరాల్లో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు : డీజీపీ

Dec 6,2023 16:45 #LB Stadium, #traffic rules

హైదరాబాద్‌ : తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎల్‌బీ స్టేడియంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయని రాష్ట్ర డీజీపీ రవి గుప్తా స్పష్టం చేశారు. ఎల్‌బీ స్టేడియంలో కొనసాగుతున్న ఏర్పాట్లను సీఎస్‌ శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తా, సీపీ సందీప్‌ శాండిల్య, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రొనాల్డ్‌ రోస్‌ కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం నేపథ్యంలో రేపు ఎల్‌బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. దాదాపు లక్ష మంది సభకు హాజరు కావొచ్చని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారని తెలిపారు. ఎల్‌బీ స్టేడియంలో 30 వేల మందికి కూర్చొనే సౌకర్యం ఉందన్నారు. మిగతా జనం కోసం స్టేడియం బయట ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తామని డీజీపీ తెలిపారు.

➡️