ఏపీలో తప్పిన పెను ప్రమాదం.. 11 మందిని కాపాడిన రెస్క్యూటీం

Dec 1,2023 15:40 #Fire Accident, #Kakinada

కాకినాడ: ఏపీలోని కాకినాడ తీరంలో జరిగిన అగ్నిప్రమాదం వల్ల పెను ప్రాణనష్టం తప్పింది. రెస్క్యూటీం సకాలంలో స్పందించి రక్షణ చర్యలు తీసుకోవడంతో 11 మంది ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నారు. వివరాలు. కాకినాడ తీరం నుంచి బోటులో 11 మంది సభ్యులు గల మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారు. తమ వెంట భోజన అవసరాలకు సరిపడే నిత్యావసరాలతో పాటు గ్యాస్‌ సిలిండర్‌ను వెంట తీసుకెళ్లారు.వంట చేసుకుని భోజనం చేసుకుని తిరిగి వస్తుండగా ఒక్కసారిగా సిలిండర్‌ పేలి మంటలు వ్యాపించాయి. వారి వద్ద ఉన్న సెల్‌ ఫోన్‌ సహాయంతో జరిగిన ఘటనను కోస్టుగార్డ్‌ సిబ్బందికి సహాయం అందజేశారు. స్పందించిన సిబ్బంది మరో బోటు సహాయంతో ఘటన స్థలానికి చేరుకుని 11 మంది మత్స్యకారులను సురక్షితంగా కాపాడి తీరానికి చేర్చారు.

➡️