ఏపీ బడ్జెట్ – హైలైట్స్

Feb 8,2024 10:52 #ap assembly
  • మూడు బిల్లులకి శాసనమండలి ఆమోదం

ఆర్జేయూకేటీ విశ్వ విద్యాలయ సవరణ బిల్లు, ఏపీ అసైన్‌ భూముల సవరణ బిల్లు, ప్రభుత్వ సేవలలో నియామకాల క్రమబద్దీకరణ, సిబ్బంది తీరు, వేతనవ్యవస్ధ హేతుబద్దీకరణ సవరణ బిల్లులకి శాసన మండలి ఆమోదం

  • శాసన మండలి పదినిమిషాలు వాయిదా

టీడీపీ సభ్యులు చైర్మన్‌ పోడియం వద్ద ప్లకార్డులతో నిరసన, నినాదాలు చేయడంతో శాసన మండలి పదినిమిషాలు వాయిదా పడింది. అంతకముందు జాబ్‌ క్యాలెండర్‌, దిశ, మద్యపాన నిషేదంపై ఎమ్మెల్సీల వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. టీడీపీ సభ్యుల వాయిదా తీర్మానాన్ని శాసన మండలి చైర్మన్‌ తిరస్కరించారు.

  • కాసేపు శాసనసభ వాయిదా

ఏపీ అసెంబ్లీ ప్రారంభమైన కాసేపటికే అసెంబ్లీ వాయిదా పడింది.  టీడీపీ సభ్యులు పోడియం వద్దకు వచ్చి ఆందోళనకు దిగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గందరగోళం ఏర్పడటంతో సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.

  • ప్రైవేటు యూనివర్సిటీ సవరణ బిల్లుకి ఆమోదం తెలిపిన అసెంబ్లీ
  • స్పీకర్‌ ఛాంబర్‌ వద్దకు దూసుకెళ్లిన టీడీపీ సభ్యులు
  • స్పీకర్‌ తమ్మినేని వద్దకు వెళ్లి నినాదాలు చేసిన టీడీపీ నేతలు
  • టీడీపీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్ తమ్మినేని.
  • నేడు ఏపీ అసెంబ్లీలో చివరి రోజు(నాలుగో రోజు) బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్నాయి. ఓట్‌ ఆన్‌ అకౌంట​ బడ్జెట్‌ను అసెంబ్లీ ఆమోదించనుంది.

 

➡️