కడియంలో గ్రీన్‌ వరల్డ్‌ ఆవిష్కృతం

Jan 31,2024 21:43 #speech, #sudha narayana murthi

– నర్సరీని సందర్శించిన సుధా నారాయణమూర్తి

ప్రజాశక్తి-కడియం (తూర్పుగోదావరి జిల్లా):కడియంలో ఒక గ్రీన్‌ వరల్డ్‌ ఆవిష్కతమైందని, అందుకు స్థానిక నర్సరీ రైతుల కృషి ఎంతో ప్రశంసనీయమని ఇన్ఫోసిస్‌ అధినేత సుధా నారాయణమూర్తి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియంలోని పల్ల వెంకన్న నర్సరీని ఆమె బుధవారం సందర్శించారు. నర్సరీ డైరెక్టర్‌ పల్ల వినరు.. సుధా నారాయణమూర్తికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె నర్సరీని తిలకించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాను బెంగళూరు, చెన్నై, కలకత్తా వంటి మహా నగరాల్లో తిరిగినా ఇటువంటి గ్రీన్‌ లకేషన్‌ తాను ఎప్పుడూ చూడలేదన్నారు. ఈ పూల ప్రపంచంలో తాను ఒక మధుర అనుభూతిని పొందినట్లు ఆమె పేర్కొన్నారు. పల్ల వెంకన్న నర్సరీలో అడుగడుగునా అద్భుతాలు ఉన్నాయని, ఒక వికలాంగుడు ఇంత గొప్ప నర్సరీని స్థాపించడం తనకు మరింత ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు.

➡️