కరీంనగర్‌ సభకు కేటీఆర్‌ దూరం..

Mar 12,2024 14:45 #KTR, #speech

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. డాక్టర్‌ పర్యవేక్షణలో గత రెండు రోజులుగా ఇంటి వద్దే చికిత్స తీసుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారు. ఈ నేపథ్యంలో కరీంనగర్‌లో జరుగుతున్న బీఆర్‌ఎస్‌ కదన భేరి సభకు హాజరు కాలేకపోతున్నట్లు తెలిపారు. లోక్‌సభ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ సమరశంఖం పూరిస్తున్నది. ఉద్యమకాలం నుంచి కలిసొచ్చిన కరీంనగర్‌ గడ్డ మీద నుంచే పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు మరోసారి జంగ్‌సైరన్‌ మోగించనున్నారు. మంగళవారం సాయంత్రం కరీంనగర్‌లోని ఎస్సారార్‌ కళాశాల మైదానంలో దాదాపు లక్ష మందితో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌, పెద్దపల్లి అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్లను ఖరారు చేసిన నేపథ్యంలో తమకు కలిసొచ్చిన గడ్డ నుంచే మొదటి సభను నిర్వహించాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది.

➡️