కులగణన షెడ్యూల్‌ పొడిగింపు

Jan 30,2024 08:04 #ap government
  • ఫిబ్రవరి 20 నాటికి పూర్తి

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కులగణన షెడ్యూల్‌ను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెల 15 నాటికి మొత్తం సర్వే పూర్తికావాల్సి ఉండగా, దానిని ఫిబ్రవరి 20 వరకూ పొడిగించిరది. ఇంటింటి పర్యటన ద్వారా వివరాలు సేకరించేందుకు ఈ నెల 28వ తేదీ వరకు గడువుగా నిర్దేశించగా, దానిని వచ్చే నెల నాలుగో తేదీ వరకు, సర్వేలో అందుబాటులో లేకుండా మిగిలిన వారి కోసం ఫిబ్రవరి రెండో తేదీ వరకు సర్వే గడువును విధించగా, దానిని ఫిబ్రవరి ఏడో తేదీ వరకు పొడిగించారు. ఈ కొత్త గడువును అన్ని శాఖల అధికారులు, జిల్లాల కలెక్టర్లు అమలు చేయాలని ప్రణాళికా శాఖ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

➡️