కేంద్రంపై ఒత్తిడి పెంచాలి- విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం)వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ విషయమై కేంద్రంలోని మోడీ సర్కారుపై ఒత్తిడి పెంచాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ రాజకీయ పార్టీలను కోరారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే దీక్షలు శనివారానికి 1122వ రోజుకు చేరాయి. దీక్షల్లో స్టీల్‌ సింటర్‌ ప్లాంట్‌ విభాగానికి చెందిన ఉద్యోగులు కూర్చున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉక్కు ఉద్యమం ఉగ్రరూపం దాల్చాల్సిన అవసరముందని పేర్కొన్నారు. భవిష్యత్తులో జరగబోయే పోరాటాలకు కార్మికులంతా సహకరించాలని కోరారు. ఎన్నికల సమయంలో మరింత ఉధృతంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం ద్వారా మాత్రమే విశాఖ ఉక్కును రక్షించుకోగలమని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేస్తున్న మోడీ సర్కారుకు రానున్న ఎన్నికల్లో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.

➡️