కేంద్రం తీరు అప్రజాస్వామికం:ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో సాగర్‌ డ్యామ్‌ను కేంద్రం సిఆర్‌పిఎఫ్‌ ఆధీనంలోకి తీసుకోవడం అప్రజాస్వామికమని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకరరెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించి తెలంగాణాతో సంప్రదించి సమస్యను పరిష్కరించే వైఖరి కాకుండా చివరలో పోలీసు బలగాలను మోహరించి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేలా చేయడం సమంసజసం కాదని పేర్కొన్నారు. బాధ్యతగల ప్రభుత్వాలు సామరస్యపూర్వక పద్ధతిని పాటించకుండా పోలీసు బలగాల ద్వారా పరిష్కరించాలనుకోవడం పొరపాటని సూచించారు. కేంద్రం సిఆర్‌పిఎఫ్‌ బలగాలతో సాగర్‌ డ్యామ్‌ను స్వాధీనం చేసుకోవడం భవిష్యత్‌లో నీటి నిర్వహణ కూడా తామే చూస్తామని అక్కడ తిష్ట వేయడం అప్రజాస్వామికమని తెలిపారు.

➡️