కొడంగల్‌కు మెడికల్‌ కాలేజీని తరలించుకుపోవడం సరైందా?: గొంగిడి సునిత

Feb 8,2024 16:05 #ex mla, #press meet

యాదాద్రి భువనగిరి : ప్రపంచ ప్రఖ్యాతి పొందే విధంగా తెలంగాణను కేసీఆర్‌ అభివృద్ధి చేశారు. రూ.1250 కోట్లతో యాదగిరిగుట్ట ఆలయాన్ని పునర్నిర్మించారు. గ్రీన్‌ ఆపిల్‌ సంస్థ కూడా యాదగిరిగుట్ట టెంపుల్‌కు అవార్డు ఇచ్చిందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునితా మహేందర్‌ రెడ్డి అన్నారు. గురువారం ఆమె ఆలేరులో మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్‌ మాట తీరు అందరికి ఆదర్శంగా ఉండాలి. రేవంత్‌ భాష పట్ల అందరూ అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం యాదగిరిగుట్టకు మెడికల్‌ కాలేజీని మంజూరు చేసింది. ఎయిమ్స్‌ కారణంగా మొదట మెడికల్‌ కాలేజ్‌ ఇవ్వలేదని మొదట కేసీఆర్‌ చెప్పిండు. కొట్లాడి యాదగిరిగుట్టకు మెడికల్‌ కాలేజీ మంజూరు చేపించామన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌తో హాస్పిటల్‌ శంకుస్థాపన చేయలేదన్నారు. అయితేయాదగిరిగుట్ట మెడికల్‌ కాలేజీని సీఎం రేవంత్‌ రెడ్డి కొడంగల్‌కు తరలించుకుపోవడం సరైందా.? అని ప్రశ్నించారు. ఈ నెలాఖరు వరకు మెడికల్‌ కాలేజీ పై స్పష్టత ఇవ్వాలన్నారు. లేదంటే తదుపరి కార్యాచరణ తీసుకుంటాం. అవసరమైతే రిలే దీక్షలకు దిగుతామని హెచ్చరించారు.

➡️