గుణదల ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు ప్రారంభించాలి : సిపిఎం

Mar 7,2024 16:29 #cpm baburao, #cpm dharna, #Vijayawada
  • సిపిఎం ఆధ్వర్యంలో గుణదల మూడు వంతెనల సెంటర్‌ వద్ద నిరసన దీక్ష

ప్రజాశక్తి-విజయవాడ : గుణదల ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం ఎన్నికల నోటిఫికేషన్‌ లోపే నిధులువిడుదల చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌.బాబురావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గుణదల ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో గుణదల మూడు వంతెనల సెంటర్‌లో గురువారం నిరసన దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా సిహెచ్‌.బాబురావు మాట్లాడుతూ.. విజయవాడలో ఒక్క ఫ్లైఓవర్‌ పూర్తి చేయలేని ప్రజాప్రతినిధులు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఇళ్లు తొలగించడంలో ఉన్న స్పీడు.. వంతెన నిర్మాణం సాగించడంలో లేదని విమర్శించారు. కాలువగట్టల వాసులకు పట్టాలు , పన్నులు లేనివారికి ఇంటి పన్నులు వేయాలని డిమాండ్‌ చేశారు. కాలవకట్టల వాసులను మోసం చేసిన బిజెపి, వైసిపి, టిడిపిలకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. విజయవాడలో ఒక్క ఫ్లైఓవర్‌ పూర్తి చేయలేని ప్రజాప్రతినిధులు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఈ ఆందోళనకు న్యాయవాది ప్రవీణ్‌ మద్దతు పలికారు. కార్యక్రమంలో సిపిఎం నేతలు బి రమణ రావు, కోట కళ్యాణ్‌, షకీలా, గోవిందు, అజరు, ప్రసన్న ,లక్ష్మణ, లక్ష్మి, సాగర్‌, ప్రవీణ్‌, సుప్రజ, వెంకటేశ్వరరావు, కృష్ణ, కృష్ణమూర్తి, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️