టీడీపీ శ్రేణులపై దాడిని ఖండించిన చంద్రబాబు

Mar 13,2024 10:30 #Chandrababu Naidu, #kandana

 

అమరావతి: గుంటూరు జిల్లా, నరసారావు పేటలో తెలుగుదేశం పార్టీ శ్రేణులపై దాడులను ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న నియోజకవర్గ ఇంచార్జ్‌ అరవింద్‌ బాబు , కార్యకర్తలపై వైసీపీ వర్గీయులు చేసిన దాడిలో పలువురికి గాయాలయ్యాయి. అధికార పార్టీ హింసకు దిగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తల ఆరోగ్య పరిస్థితిపై పార్టీ నేతలతో మాట్లాడి చంద్రబాబు నాయుడు ఆరాతీశారు.

➡️