ట్విట్టర్‌లో ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర వీడియో..!

Nov 18,2023 11:58 #mlc kavita, #post, #Telangana

తెలంగాణ : బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్‌లో ఆసక్తికర వీడియోను పోస్టు చేసి హర్షాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారానికిగాను నిజామాబాద్‌ నుంచి జగిత్యాలకు వెళుతున్న క్రమంలో … ఆర్మూర్‌లోని సిద్దులగుట్ట వద్ద రోడ్డుకు ఇరువైపులా రైతులు వడ్లను ఆరబెట్టిన దృశ్యాలను ఆమె చిత్రీకరించారు. రోడ్డు పక్కన ఉన్న వరి ధాన్యపు రాశులను చూసి కవిత మురిసిపోయారు. తాను వెళుతున్న దారిలో ఆ ధాన్యపు రాశులను చూసిన కవిత.. తన మొబైల్‌లో చిత్రీకరించి, ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ” ధాన్యపు రాశుల తెలంగాణ. అప్పుడు ఎట్లుంది తెలంగాణ..!! ఇప్పుడు ఎట్లైంది తెలంగాణ !!” అని కవిత పేర్కొన్నారు.

 

➡️