డిఎస్‌సి నోటిఫికేషన్‌ పై హైకోర్టులో పిటిషన్‌ – విచారణ రేపటికి వాయిదా

అమరావతి : సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఖాళీల భర్తీ చేపట్టారంటూ … డిఎస్‌సి నోటిఫికేషన్‌ గురించి రాష్ట్ర హైకోర్టులో వేసిన పిటిషన్‌ పై సోమవారం విచారణ జరిగింది. ఎపి ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ పై రాష్ట్ర హైకోర్టులో పిటిషన్‌ దాఖలయింది. ఎస్‌జిటి పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడంపై పిటిషన్‌ వేశారు. ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని పిటిషన్‌లో పిటిషనర్‌ పేర్కొన్నారు. బీఈడీ అభ్యర్థులకు అనుమతిని ఇవ్వడం వల్ల డీఎడ్‌ అభ్యర్థులు నష్టపోతారని అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఖాళీల భర్తీ చేపట్టారని అన్నారు. పిటిషన్‌ ను విచారించిన హైకోర్టు… సుప్రీంకోర్టు నిబంధనలు అమలు కావాలి కదా ? అని ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

➡️