డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన ఎన్‌ఆర్‌ఐ ప్రతినిధులు..

హైదరాబాద్‌: సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఎన్‌ఆర్‌ఐ ప్రతినిధులు కలిశారు. మే 24 నుంచి 26 వరకు అమెరికాలో జరిగే తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మహాసభలకు రావాలని ఇన్విటేషన్‌ ఇచ్చారు. డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో ఎన్‌ఆర్‌ఐ సంఘం అధ్యక్షులు వంశీ రెడ్డి, ప్రతినిధులు మలిపెద్ది నవీన్‌, కవితా రెడ్డి, సురేష్‌ రెడ్డి, గణేష్‌, జ్యోతిరెడ్డి, మనోజ్‌ రెడ్డి, దుర్గాప్రసాద్‌, మనోహర్‌ తదితరులు ఉన్నారు. మరోవైపు.. ఈ నెల 23న రవీంద్రభారతిలో జరిగే సేవా డేస్‌ కార్యక్రమానికి రావాలని ఆహ్వానము అందించారు.డిసెంబర్‌ 10 నుంచి ఈనెల 23 వరకు రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల గురించి వారు డిప్యూటీ సీఎంకు వివరించారు. వరంగల్‌ లో 38 కంపెనీల సహకారంతో జాబ్‌ మేళా నిర్వహించగా.. 16,000 మంది హాజరయ్యారని, అందులో 1500 మంది నిరుద్యోగులను ఎంపిక చేసామని చెప్పారు. అదే విధంగా 2024 మే 24 నుంచి 26 వరకు అమెరికాలోని వాషింగ్టన్‌ లో నిర్వహించే తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మహాసభలకు కూడా రావాలని విజ్ఞప్తి చేశారు.

➡️