డివైడర్‌ను ఢీ కొట్టిన బైక్‌ .. ఇద్దరు మృతి

Feb 2,2024 15:05 #medak, #road accident

మెదక్‌ : మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన కొల్చారం వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..బైక్‌ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు డివైడర్‌ను డీ కొట్టారు. ఈ ప్రమాదంలో కొల్చారం మండల కేంద్రంకు చెందిన ఆరిఫ్‌ (55) అక్కడికక్కడే మఅతి చెందగా మాజీ వార్డు సభ్యుడు మహ్మద్‌ (48) అసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు.ఇరువురు కౌడిపల్లి నుంచి కొల్చారం వచ్చే క్రమంలో ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మెదక్‌ దవాఖానకు తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆరిఫ్‌,మహ్మద్‌ మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి.

➡️