డిసెంబర్‌ 12కు చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

అమరావతి: ఉచిత ఇసుక కేసులో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. న్యాయస్థానం తదుపరి విచారణను డిసెంబర్‌ 12వ తేదీకి వాయిదా వేసింది.గత ప్రభుత్వ హయాంలోని ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు జరిగాయంటూ ఏపీ సీఐడీ ఇటీవల కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం చంద్రబాబు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. నవంబర్‌ 30న విచారణ జరగ్గా… చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఆ వాదనలు విన్న ధర్మాసనం.. తాము తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు చంద్రబాబు విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశించింది.సీఐడీ తరఫున వాదనలు వినిపించేందుకు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) శ్రీరామ్‌ సమయం కోరడంతో విచారణను డిసెంబర్‌ 6కు వాయిదా వేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం మరోసారి విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్‌పై తదుపరి విచారణను డిసెంబర్‌ 12కు వాయిదా వేసింది.

➡️