డ్రెస్‌ కోడ్‌ మార్చడం పట్ల హర్షం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలోని ఎపిఎస్‌పి, ఎఆర్‌ పోలీసులకు డ్రెస్‌ కోడ్‌ను మార్చడం పట్ల ఎపి పోలీస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎపి పోలీస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు ఆర్‌ రఘురామ్‌ తదితరులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్‌ సిబ్బందికి బ్యారెట్‌ క్యాప్‌ నుంచి పీ క్యాప్‌ ఇచ్చి డ్రెస్‌కోడ్‌ మార్చడం తమకు సంతోషాన్ని కలిగించిందని వారు పేర్కొన్నారు.

➡️