తిరుమలలో పెరిగిన యాత్రికు రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం

తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు యాత్రికులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. యాత్రికుల రద్దీతో 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. శనివారం స్వామివారిని 68,179 మంది యాత్రికులు దర్శించుకోగా 29,726 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.యాత్రికులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.06 కోట్లు వచ్చిందని తెలిపారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ఆదివారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదల ప్రకారం ఆలయ అధికారులు ఆలయం ఎదుట స్వాగతం పలికారు. పూజల అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి సన్మానించారు.

➡️