పెండింగ్‌ చలాన్ల చెల్లింపునకు విశేష స్పందన

Jan 6,2024 15:08 #Pending Dues, #vehicals chalana

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాయితీలతో ట్రాఫిక్‌ పెండింగ్‌ చలాన్ల చెల్లింపునకు విశేష స్పందన లభిస్తోందని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అడిషనల్‌ కమిషనర్‌ విశ్వప్రసాద్‌ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.3.59 కోట్ల చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన అన్నారు. వీటిలో 77 లక్షల చలాన్లు చెల్లింపు అయ్యాయని తెలిపారు. వీటి ద్వారా రూ.67 కోట్ల పెండింగ్‌ చలాన్ల అమౌంట్‌ కలెక్ట్‌ అయ్యిందని పేర్కొన్నారు.పెండింగ్‌ చలాన్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన భారీ డిస్కౌంట్‌ ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగుతోందని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అడిషనల్‌ కమిషనర్‌ విశ్వప్రసాద్‌ గుర్తు చేశారు. వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెండింగ్‌ చలాన్లను క్లియర్‌ చేసుకోవాలని సూచించారు.

➡️