ప్రగతి సాధించడానికి శ్రమనే ఆధారం : గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

Feb 28,2024 15:05 #governer taamil sai, #speech

తెలంగాణ: తెలంగాణ భాష ‘క్లాసిక్‌ భాష’ అని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. తెలంగాణ భాష మాట్లాడుతున్నప్పుడు చాలా ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. తెలుగు భాష, సంస్కృతి అంతటా వ్యాప్తి చెందాలన్నారు. తెలుగు భాషను ఇతర భాషలు మాట్లాడే ప్రజలందరికీ నేర్పించాలని గవర్నర్‌ పేర్కొన్నారు. ప్రగతి సాధించడానికి షార్ట్‌ కట్‌ ఏమీ ఉండదని, శ్రమనే ఆధారం అని గవర్నర్‌ తమిళిసై చెప్పారు. రవీంద్ర భారతిలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పదహారవ స్నాతకోత్సవంలో గవర్నర్‌ పాల్గన్నారు. పలు కోర్సుల్లో పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి పట్టాలు అందజేశారు. తెలుగులో మాట్లాడటం నాకు సంతోషంగా ఉంది. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఇలాంటి పండుగ జరగడం ఎంతో ఆనందం, ఇది కన్నుల పండగగా ఉంది’ అని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై అన్నారు.’మాతృభాష మన జీవితంలో అవసరం. తెలుగు మాట్లాడే వాళ్లు ప్రపంచ దేశాలలో వివిధ రాష్ట్రాలలో ఉన్నారు. తెలుగు భాషను ఇతర భాషలు మాట్లాడే ప్రజలందరికీ నేర్పించాలి. తక్కువ ఖర్చుతో తెలుగు భాష పుస్తకాలను ప్రచురించి.. సామాన్య ప్రజలు కొని చదివే విధంగా ఉండాలి. నా మాతఅభాష తమిళ్‌. నేను మా సోదర భాష తెలుగు మాట్లాడడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రగతి సాధించడానికి షార్ట్‌ కట్‌ అంటూ ఏమీ ఉండదు, శ్రమనే ఆధారం’ అని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చెప్పుకొచ్చారు.

➡️