ప్రశ్నించిన వారిని వైసిపి ప్రభుత్వం హింసిస్తోంది : లోకేశ్‌

Dec 10,2023 15:12 #Nara Lokesh, #yuvagalam padayatra

తుని: గత ప్రభుత్వం తీసుకొచ్చిన పరిశ్రమలను వైసిపి ప్రభుత్వం తరిమేసిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విమర్శించారు. మూడు నెలల్లో అధికారంలోకి వస్తామని, మళ్లీ పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా కాకినాడ సెజ్‌ బాధిత రైతులతో నారా లోకేశ్‌ ముఖాముఖి మాట్లాడారు. రాష్ట్రంలో పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సి ఉందన్నారు.” తక్కువ కాలుష్యంతో పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యత టిడిపి తీసుకుంటుంది. పరిశ్రమలు వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి. స్థానికులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తాం. టిడిపి హయాంలో తీసుకొచ్చిన కియా పరిశ్రమ వల్ల వేలాది మంది జీవితాల్లో మార్పు వచ్చింది. పరిశ్రమలు వస్తే గ్రామాల రూపురేఖలు మారిపోతాయి. ఆక్వా రంగంలో 10 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. వైసిపి ప్రభుత్వం హయాంలో ఆక్వా ఉద్యోగులు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్తున్నారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఫోన్ల పరిశ్రమ తీసుకొచ్చా. ఆ పరిశ్రమలో 6వేల మంది పని చేసేవారు” అని లోకేశ్‌ గుర్తు చేశారు. న్యాయం చేయాలని ప్రశ్నించిన వారిని వైసిపి ప్రభుత్వం హింసిస్తోందన్న లోకేశ్‌.. మూడు నెలల్లో ప్రజల ప్రభుత్వం ఏర్పడబోతోందని ధీమా వ్యక్తం చేశారు.

➡️