బడ్జెట్‌లో గిరిజనులకు తీవ్ర అన్యాయం

– ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రామారావు, సురేంద్ర

ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌ (అల్లూరి జిల్లా) :కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని ఆదివాసీలకు, గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఈ బడ్జెట్‌ను ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. బడ్జెట్‌పై అరకువేలిలోని ఆదివాసీ గిరిజన సంఘం భవనంలో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లోతా రామారావు, కిల్లో సురేంద్ర గురువారం మీడియాతో మాట్లాడారు. ఇది బిజెపి ఎన్నికల బడ్జెట్‌ అని, ప్రజా సంక్షేమ బడ్జెట్‌ కాదని విమర్శించారు. ఈ బడ్జెట్‌ ఆదివాసీలకు, పేదలకు, కార్మికులకు తీవ్ర నిరాశను మిగిల్చిందన్నారు. పోలవరం నిర్వాసితుల సమస్య పరిష్కారానికి ఏటువంటి పరిష్కారం చూపకపోవడం దారుణమన్నారు. ఆదివాసీలకు బడ్జెట్‌ కేటాయింపులు తగ్గించి బడా కార్పొరేట్‌ కంపెనీలకు రాయితీలు ప్రకటించిందని, గిరిజన యూనివర్సిటీ కేటాయింపు అతిగతిలేదన్నారు. ఆదివాసీ చట్టాలు, హక్కుల రక్షణకు ఎటువంటి చర్యలూ తీసుకోలేదని మండిపడ్డారు.

➡️